బోసిపోతున్న మార్కెట్‌యార్డు రోడ్డు | Nobady in market yards | Sakshi
Sakshi News home page

బోసిపోతున్న మార్కెట్‌యార్డు రోడ్డు

Nov 25 2016 3:19 AM | Updated on Oct 9 2018 2:17 PM

బోసిపోతున్న మార్కెట్‌యార్డు రోడ్డు - Sakshi

బోసిపోతున్న మార్కెట్‌యార్డు రోడ్డు

మండల కేంద్రంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన మార్కెట్‌యార్డు రోడ్డు బోసిపోతోంది.

చొప్పదండి: మండల కేంద్రంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన మార్కెట్‌యార్డు రోడ్డు బోసిపోతోంది. నిత్యం నిత్యం వందలాది వాహనాల్లో మార్కెట్‌కు ధాన్యం, ప్రత్తి, మొక్కజొన్న నిలువలు తరలిస్తూ కళకళలాడే యార్డు రోడ్డు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో వెలవెల బోతోంది. కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు లేక మార్కెట్ పరిసరాలు, బీటీ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. ఈ రోడ్డులో అడ్తి వ్యాపారుల దుకాణాలు, విత్తనాలు, మందుల దుకాణాలు రైతుల హడావిడి కనిపించడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేందుకు వస్తున్నా రద్దు చేసిన నోట్లను వ్యాపారులు స్వీకరించక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల చలామణి పెరిగితే తప్ప మార్కెట్ రోడ్డుకు పూర్వ వైభవం వచ్చేలా లేదు. 

Advertisement
 
Advertisement
Advertisement