ధన్‌సింగ్‌కు నివాళులు అర్పిస్తున్న సీఎండీ
ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ధన్‌సింగ్ ఎంతో కృషి చేశాడని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు.
-
ఆయన సేవలు చిరస్మరణీయం
-
ఎస్‌ఈ ధన్‌సింగ్ సంస్మరణ సభలో సీఎండీ వెంకటనారాయణ
ఖమ్మం: ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ధన్‌సింగ్ ఎంతో కృషి చేశాడని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. అందుకే ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ ఎస్‌ఈ ధన్‌సింగ్ శుక్రవారం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో నిర్వహంచిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి సీఎండీ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి పనినైనా పాజిటివ్ దృక్పథంతో అలోచించి పనిని పూర్తిచేయడంలో ధన్‌సింగ్ దిట్ట అన్నారు. ధన్‌సింగ్ అకాల మృతి ఆయన కుటుంబానికే కాకుండా సంస్థకు కూడా తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు, సీఈ సబర్‌లాల్, నగేష్, వరంగల్ కార్పొరేట్ కార్యాలయం పర్చేజింగ్ ఎస్‌ఈ తిరుమలరావు, తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సామ్యానాయక్, ఖమ్మం ఎస్‌ఈ నాగప్రసాద్, డీఈలు సురేందర్, రవి, ప్రతాపరెడ్డి, మల్లికార్జున్, నరేష్, బాబూరావు, జీహెచ్‌ఎంసీ డీఈ వేణుమాధవ్, ఏడీలు, ఏఈలు, యూనియన్ నాయకులు శేషగిరిరావు, సత్యనారాయణరెడ్డి, గోపాల్, ప్రసాద్‌లు ధన్‌సింగ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.