నెత్తురోడిన రహదారులు | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారులు

Published Sat, Nov 19 2016 2:18 AM

నెత్తురోడిన రహదారులు - Sakshi

జిల్లాలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ట్రాలీ ఢీకొని ఇద్దరు, ఆటో తిరగబడి ఒకరు మృతి చెందారు.∙మోటారు సైకిల్‌ ఢీ కొని వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
తీపర్రు (పెరవలి) : ఆగి ఉన్న ట్రాలీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కొప్పాక లక్ష్మణరావు(23), రంకిరెడ్డి సతీష్‌(24) వడ్రంగి పని చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. గురువారం ఉదయం పని నిమిత్తం కానూరు వెÐðళ్లారు. పని ఎక్కువగా ఉండటంతో చీకటి పడే వరకు పని చేసి రాత్రి 10.30 గంటలకు మోటార్‌ సైకిల్‌పై స్వగ్రామం బయలుదేరారు. తీపర్రు సమీపంలోకి వచ్చేటప్పటకి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీని గమనించక వేగంగా ఢీకొన్నారు. ఇద్దరి తలలకు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలికి చేరి కన్నీరుమున్నీరుగా విలపించారు. పెరవలి ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాత్రికి రాత్రే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు.  
 
రోడ్డు దాటుతుండగా.. 
నిడదవోలు : పట్టణంలో గూడెం రైల్వేగేటు సమీపంలో వార్ఫ్‌ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. రైల్వేగూడ్స్‌ వ్యాగి¯ŒS నుంచి బయటకు వస్తూ రోడ్డు దాటుతున్న వృద్ధుడ్ని నిడదవోలు నుంచి శెట్టిపేట వెళుతున్న మోటర్‌ సైకిల్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుమారు 65 ఏళ్లు వయసు ఉంటుందని, ఫ్యాంట్, చొక్కా ధరించి ఉన్నాడని పట్టణ ఎస్సై డి.భగవా¯ŒS ప్రసాద్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 
 
ఆటో తిరగబడి.. 
పోలవరం రూరల్‌ : పోలవరంలో ప్రమాదవశాత్తు ఆటో తిరగబడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయంత్రం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌సై కె.శ్రీహరిరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలవరం గ్రామానికి చెందిన తాడేపల్లి వెంకటేశ్వరరావు(45) ఒక్కడే ఆటోలో ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తూ తిరగబడింది. తీవ్ర గాయాలపాలైన అతనిని పోలవరం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement