వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలోకి ప్రవేశం కోసం 5వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
Jul 21 2016 12:13 AM | Updated on Sep 4 2017 5:29 AM
మామునూరు : వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలోకి ప్రవేశం కోసం 5వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు
. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లోని ఎంఈఓ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిచేసిన ప్రవేశపరీక్ష దరఖాస్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయా మండల కేంద్రాల్లోని విద్యాశాఖ కార్యాలయం లో, లేక మామునూరు నవోదయ విద్యాలయంలో అందజేయాల న్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో 2017 జనవరి 8వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Advertisement
Advertisement