జాతీయ జట్టులో చోటు సాధించాలి | national team member ambition | Sakshi
Sakshi News home page

జాతీయ జట్టులో చోటు సాధించాలి

Nov 18 2016 9:06 PM | Updated on Sep 4 2017 8:27 PM

జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి

  • హకీ రాష్ట్ర జట్టుకు ఎంపికైన వీకే రాయపురం విద్యార్థి
  • సామర్లకోట : 
    జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి హకీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 22 నుంచి 26 వరకు బోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి చాంపియ¯ŒS షిప్‌ పోటీలలో అండర్‌- 17 విభాగంలో  పాల్గొంటున్నాడు. ఇటీవల అండర్‌-17 విభాగంలో నెల్లూరు జిల్లాలో 12, 13, 14 తేదీలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు హకీ జిల్లా కోచ్‌ రవిరాజ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 2014లో పైకా టోర్నమెంటులో పాల్గొన్న వీరబాబు 2015లో జిల్లా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి పాఠశాలలో చదువుకొంటున్నాడని, తల్లి అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా పని చేస్తోందన్నారు. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్‌ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉందని వీరబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థి వీరబాబును పాఠశాల హెచ్‌ఎం అనురాధ, గ్రామ సర్పంచ్‌ కుర్రా నారాయణస్వామి, కోచ్‌ రవిరాజ్‌లు, గ్రామ నాయకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బోపాల్‌ బయలు దేరాడు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement