జాతీయ స్థాయికి ఇన్‌స్పైర్‌కు సాయిబాబా విద్యార్థులు | national level inspire select in saibaba students | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయికి ఇన్‌స్పైర్‌కు సాయిబాబా విద్యార్థులు

Dec 2 2016 11:01 PM | Updated on Sep 4 2017 9:44 PM

కడప నగరం అక్కాయపల్లెలోని సాయిబాబా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలకు ఎంపికయ్యారు.

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరం అక్కాయపల్లెలోని సాయిబాబా పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలకు ఎంపికయ్యారు. మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో సాయిబాబా పాఠశాలకు చెందిన స్వాతి తయారు చేసిన ఇంటిలిజెంట్‌ వెహికిల్‌ నమూనా జాతీయస్థాయికి ఎంపికైయింది. ఈనెల 9వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌లో స్వాతి నమూనా ప్రదర్శించనున్నట్లు సాయిబాబా విద్యాసంస్థల అధినేత రామచంద్రారెడ్డి తెలిపారు.  అనంతరం జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement