కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు | national level games ongoing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు

Oct 6 2016 10:18 PM | Updated on Sep 4 2017 4:25 PM

కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు

కొనసాగుతున్న జాతీయ స్థాయి క్రీడలు

భువనగిరి టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న అండర్‌ –19 జాతీయ స్థాయి క్రీడలు గురువారం కూడా కొనసాగాయి.

భువనగిరి టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న అండర్‌ –19 జాతీయ స్థాయి క్రీడలు గురువారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్వి లావణ్య, బాల్‌బ్యాడ్మింటన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాకౌట్, సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. కాగా బాలుర విభాగం సెమీ ఫైనల్‌లో తమిళనాడుతో 35–33, 27–35, 35–20 పాయింట్లతో విజయం సాధించిన ఏపీ, కేరళపై 35–20, 35–31తో విజయం సాధించిన కర్నాటక జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అలాగే బాలికల విభాగంలో ఏపీపై 35–17, 35–20 పాయింట్లతో విజయం సాధించిన తమిళనాడు, కర్నాటకపై 31–35, 35–25, 28–35 పాయింట్ల తేడాతో విజయం సాధించిన కేరళ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. కాగా ఫైనల్‌ పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement