నన్నయ రిజిస్ట్రార్‌గా నరసింహారావు | nanayya registar narasimharao | Sakshi
Sakshi News home page

నన్నయ రిజిస్ట్రార్‌గా నరసింహారావు

Aug 21 2016 10:14 PM | Updated on Sep 4 2017 10:16 AM

నన్నయ రిజిస్ట్రార్‌గా నరసింహారావు

నన్నయ రిజిస్ట్రార్‌గా నరసింహారావు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎ.నరసింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వాణిజ్య నిర్వహణ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వస్తున్న సంగతి విదితమే.

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎ.నరసింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వాణిజ్య నిర్వహణ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వస్తున్న సంగతి విదితమే. ఎంకాం, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్‌సీ, పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగిన ఆయన ఏయూ ఆర్ట్స్‌ కళాశాల వార్డెన్‌గా, దూర విద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ఏఐసీటీఈ తనిఖీ బృందం సభ్యునిగా, ఏయూ సీపీసీ సభ్యునిగా, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేట్‌ సభ్యునిగా వ్యవహరించారు. ఫైనాన్స్, అకౌంటింగ్, అపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో నిపుణుడైన ఆయన ‘ఐసెట్‌’ ప్రాంతీయ సమన్వయకర్తగా కూడా పనిచేశారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement