కేజే కుమార్ అరెస్ట్ | nagari municipal chairperson husband arrested | Sakshi
Sakshi News home page

కేజే కుమార్ అరెస్ట్

Aug 16 2015 9:29 AM | Updated on Sep 3 2017 7:33 AM

కేజే కుమార్ అరెస్ట్

కేజే కుమార్ అరెస్ట్

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి భర్త కేజే కుమార్ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి భర్త కేజే కుమార్ ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేశారు. శాంతకుమారి నివాసంలోని గేట్లు పగులగొట్టి కేజే కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పుత్తూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.

తన భర్తను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శాంతకుమారి పుత్తూరు పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. తన భర్తకు ప్రాణాహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రోత్సాహంతోనే పోలీసులు తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని వాపోయారు. కేజే కుమార్ అరెస్ట్ పై  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి స్పందించారు.  నగరిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement