'అన్నపూర్ణ లాంటి ఏపీ కరువు రాష్ట్రంలా మారింది' | mvs nagireddy questions ap cm on droght issue | Sakshi
Sakshi News home page

'అన్నపూర్ణ లాంటి ఏపీ కరువు రాష్ట్రంలా మారింది'

Nov 3 2016 2:23 PM | Updated on Jul 6 2019 12:58 PM

'అన్నపూర్ణ లాంటి ఏపీ కరువు రాష్ట్రంలా మారింది' - Sakshi

'అన్నపూర్ణ లాంటి ఏపీ కరువు రాష్ట్రంలా మారింది'

ఏపీలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఏపీలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూలేని కరువును ఈ ఏడాది రాష్ట్రం ఎదుర్కొంటుందని, లక్షలాది ఎకరాల్లో భూములు బీడులుగా మారాయని తెలిపారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ కరువు పీడిత రాష్ట్రంలా మారిందని నాగిరెడ్డి ఆరోపించారు.

సీఎం చంద్రబాబు నాయుడు కరువును జయించామన్నారు.. అయితే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఖరీఫ్ పూర్తిగా దెబ్బతిని రబీ పరిస్థితి కూడా అలానే మారిందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement