కడియం ఇంటివద్ద ఎంఎస్‌ఎఫ్‌ భిక్షాటన | MSF home Kadiyam bhiksatana | Sakshi
Sakshi News home page

కడియం ఇంటివద్ద ఎంఎస్‌ఎఫ్‌ భిక్షాటన

Aug 5 2016 12:14 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జాతి కోసం మేము సైతం అం టూ మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌) కేయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మాదిగ విద్యార్థులు మహాభిక్షాటన కార్యక్రమంను నిర్వహించారు.

విద్యారణ్యపురి : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జాతి కోసం మేము సైతం అం టూ మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌ఎఫ్‌) కేయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మాదిగ విద్యార్థులు మహాభిక్షాటన కార్యక్రమంను నిర్వహించారు.  వర్గీకరణ చట్టబద్ధతకు ఈనెల 10న ఢిల్లీలో జరిగే మహాదీక్షకు తరలివెళ్లడం కోసం డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ ,నగర మేయర్‌ నన్నపనేని నరేందర్‌లను ఆ కమిటీ బాధ్యులు కలిసి చలో ఢిల్లీకోసం బిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. ఎమ్మార్పీఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్‌ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయపరమైన డిమాండ్‌ అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్‌ కేయూ ఇన్‌చార్జి మంద భాస్కర్, బాధ్యులు ఎర్రోళ్ల పోచయ్య, బుర్రి సతీష్‌ మాదిగ, రాగళ్ల ఉపేందర్‌ మాదిగ, రవీందర్, గంగారపు శ్రీనివాస్,  సుకుమార్, భిక్షపతి, భాస్కర్, రాజు, ప్రశాంత్‌ మాదిగ, శ్రీను, శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement