నయవంచకుల్లో ప్రపంచంలోనే నంబర్ ఒన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు.
తిరుపతి : నయవంచకుల్లో ప్రపంచంలోనే నంబర్ ఒన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం గత నెల 20న రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య శ్రీకాకుళంలో ప్రారంభించిన మాదిగల చైతన్య యాత్రను శుక్రవారం సాయంత్రం తిరుపతిలో ముగించారు.
బ్రహ్మయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాటను తుంగలోతొక్కి మాదిగల ఆశయాలను, ఆశలను మంటగలిపి విశ్వాస ఘాతకుడుగా చంద్రబాబు చరిత్రకెక్కారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు ఈ నెల 19 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలో మహా ధర్నాలు, నిరసన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఎంఆర్‌పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గోపిమాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు.