మరో 700 ఎకరాల భూసేకరణ : కలెక్టర్‌ | More than 700 acres of land acquisition: Collector | Sakshi
Sakshi News home page

మరో 700 ఎకరాల భూసేకరణ : కలెక్టర్‌

Aug 8 2017 11:03 PM | Updated on Mar 21 2019 8:35 PM

కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో మరో 700 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. మండలంలోని ఎర్రమంచి పొలాల్లో చేపట్టిన కియా కార్ల పరిశ్రమ పçనులను ఆయన మంగళవారం కొరియా బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..

పెనుకొండ:

కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో మరో 700 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. మండలంలోని ఎర్రమంచి పొలాల్లో చేపట్టిన కియా కార్ల పరిశ్రమ పçనులను ఆయన  మంగళవారం కొరియా బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనుబంధ సంస్థల ఏర్పాటుకు 700 ఎకరాల భూమి అవసరమని కొరియా బృందం కోరడంతో ఏపీఐఐసీ సహకారంతో భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతినిధులు సంతృప్తి చెందితే భూమిని సేకరించి ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామమూర్తి, కియా ప్రతినిథులు, కొరియా నూతన బృందం సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement