మోడీ కాస్ట్‌లీ ఫకీర్‌ | modi is costly pakir | Sakshi
Sakshi News home page

మోడీ కాస్ట్‌లీ ఫకీర్‌

Dec 4 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:54 PM

నేను పేదల కోసమే పని చేస్తున్నా.. నేనొక ఫకీరునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు.ఆదివారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు.దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. గాడ్సే అహింసను ప్రభోదించినట్లు మోదీ వ్యాఖ్యలున్నాయన్నారు.

వేంపల్లిః నేను పేదల కోసమే పని చేస్తున్నా.. నేనొక ఫకీరునని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని  రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు.ఆదివారం ఆయన వేంపల్లిలో మాట్లాడారు.దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. గాడ్సే అహింసను ప్రభోదించినట్లు మోదీ వ్యాఖ్యలున్నాయన్నారు.బీజేపీని నడిపిస్తున్నది నల్లధన కుబేరులన్నారు.  రెండున్నరేళ్లలో లలిత్‌మోడీ కుంభకోణం,విజయమాల్యా బకాయిల మాఫీ, బియ్యం కుంభకోణం తదితరాలు ఉన్నాయన్నారు. తాను ఫకీర్‌నని చెప్పడం 2016 జోక్‌ అన్నారు. ఆయన 10లక్షల సూట్‌ వేసుకొనే  అత్యంత ఖరీదైన ఫకీరన్నారు.బంగారానికి భారతీయ మహిళలకు ఉన్న  అనుబంధం తల్లీబిడ్డల అనుబంధమన్నారు. బంగారు రహిత దేశాన్ని ఆవిష్కరించాలని చూడడం దురదృష్టకరమన్నారు.మహిళలల జోలికి వస్తే మోదీ మటాష్‌ కావడం తథ్యమన్నారు.బీజేపీ రహిత భారత్‌ను ఆవిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఇన్‌ఛార్జి శ్రీనువాసులు రెడ్డి,యన్‌యస్‌యుఐ జిల్లా అధ్యక్షులు «ధృవ కుమార్‌ రెడ్డి,సేవాదళ్‌ జిల్లా చైర్మన్‌ చార్లెస్,నాయకులు ఉత్తన్న,బాబు,రామకృష్ణ,రామచంద్ర,వెంకట సుబ్బారెడ్డి,నరసింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement