భద్రాదిలో ప్రధాని సోదరుడు | modi brother visits badrachalam | Sakshi
Sakshi News home page

భద్రాదిలో ప్రధాని సోదరుడు

Jul 6 2016 9:12 PM | Updated on Aug 21 2018 9:33 PM

భద్రాదిలో ప్రధాని సోదరుడు - Sakshi

భద్రాదిలో ప్రధాని సోదరుడు

భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు సోమాభాయి ఆనంద్ మోదీ బుధవారం దర్శించుకున్నారు.

భద్రాచలం(ఖమ్మం): భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు సోమాభాయి ఆనంద్ మోదీ బుధవారం దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్న ఆయన ఎటువంటి హంగూఆర్భాటం లేకుండా తోటి మిత్రులతో కలసి అంతరాలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మోదీ సోదరుడు అని తెలియటంతో ఆలయ మర్యాదలు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించగా, ఆయన వాటిని తిరస్కరించారు. సామాన్య భక్తుడి మాదిరే దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ప్రొటోకాల్, బందోబస్తు లేకుండానే ఆయన భద్రాచలం పర్యటనకు రావటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement