తస్మదీయుని ఇంటికి వెళితే ధర్నా చేస్తా.. | mlc demand | Sakshi
Sakshi News home page

తస్మదీయుని ఇంటికి వెళితే ధర్నా చేస్తా..

Nov 3 2016 10:34 PM | Updated on Aug 30 2019 8:37 PM

పెద్దాడ వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు(పార్టీలోఎమ్మెల్యే వర్గం) ఇంటి వద్ద అల్పాహారానికి వెళ్లబోయారు. ఎమ్మెల్సీ భాస్కరరామారావు అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్సీగా ఉండి గ్రామంలో కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేసిన తన ఇంటికే రావాలని, లేకుంటే శంకుస్థాపన చేసి అనంతరం సత్తిరాజు ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఇద్దరూ కావలసిన వారేనని,

  • మంత్రి కామినేనికి ఎమ్మెల్సీ బొడ్డు హెచ్చరిక
  • పెదపూడి : 
    పెద్దాడ వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు(పార్టీలోఎమ్మెల్యే వర్గం) ఇంటి వద్ద అల్పాహారానికి వెళ్లబోయారు. ఎమ్మెల్సీ భాస్కరరామారావు అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్సీగా ఉండి గ్రామంలో కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేసిన తన ఇంటికే రావాలని, లేకుంటే శంకుస్థాపన చేసి అనంతరం సత్తిరాజు ఇంటికి వెళ్లాలని చెప్పారు. ఇద్దరూ కావలసిన వారేనని, ఎంపీ మురళీ మోహ¯ŒS కూడా అక్కడే ఉన్నందున అక్కడికి వెళ్లి వస్తానని చెప్పారు. ససేమిరా అన్న భాస్కరరామారావు అక్కడికి వెళితే తాను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి వెళ్లిపోతానని, అవసరమైతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మంత్రి శంకుస్థాపన స్థలానికి బయలు దేరారు. అప్పటికే అక్కడికి టీడీపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల వారు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మంత్రి ఫో¯ŒS చేయడంతో మురళీమోహ¯ŒS అక్కడికి వచ్చాక అందరూ కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement