సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే | MLA observed review meeting places | Sakshi
Sakshi News home page

సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

Jul 21 2016 7:25 PM | Updated on Sep 4 2017 5:41 AM

సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరిశీలించారు

మిర్యాలగూడ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్వహించే హరితహారానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఇందు కోసం స్థానిక ఎన్‌ఎస్పీ క్యాంపులో సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 24 లేదా 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఒక్క రోజే లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్డీఓ కిషన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, కౌన్సిలర్‌ తిరునగరు భార్గవ్, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి రమేశ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చిట్టు బాబునాయక్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement