పోలీసుల అదుపులో ఎమ్మెల్యే ఆది అనుచరులు? | Mla aadhi followers in police custedy? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే ఆది అనుచరులు?

Aug 19 2016 11:12 PM | Updated on Sep 4 2017 9:58 AM

సింహాద్రిపురం పోలీసుల అదుపులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 17న కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు చేసిన రాళ్ల దాడి ఘటనలో.. వారిని ఇక్కడి స్టేషన్‌కు రెండు రోజుల క్రితం తీసుకొచ్చినట్లు సమాచారం.

 సింహాద్రిపురం : సింహాద్రిపురం పోలీసుల అదుపులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 17న కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌పై ఎమ్మెల్యే అనుచరులు చేసిన రాళ్ల దాడి ఘటనలో.. వారిని ఇక్కడి స్టేషన్‌కు రెండు రోజుల క్రితం తీసుకొచ్చినట్లు సమాచారం. కొండాపురం మండలం సంకేపల్లె వద్ద చేపడుతున్న నీరు– చెట్టు పనులు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో జగదేకర్‌రెడ్డితోపాటు మరో 30 మంది ఉన్నట్లు తెలిసింది. నిందితులను డీఎస్పీ సర్కార్‌ గురువారం విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీఐ రవిబాబుతోపాటు కొండాపురం, తాళ్ల ప్రొద్దుటూరు, ముద్దనూరు ఎస్‌ఐలు ఇక్కడే మకాం వేశారు. వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement