మెట్టుపల్లిని ఇల్లంతకుంటలో కలపాలి | Mix mettupalli in illanthakunta | Sakshi
Sakshi News home page

మెట్టుపల్లిని ఇల్లంతకుంటలో కలపాలి

Sep 17 2016 12:51 AM | Updated on Sep 4 2017 1:45 PM

మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో కలపాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సుమారు మూడు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేయడం గమనార్హం.

  • కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
  • జోరు వానలోనూ మూడు గంటల పాటు నిరసన
  • హన్మకొండ అర్బన్ : మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో కలపాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సుమారు మూడు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేయడం గమనార్హం. తమ గ్రామాన్ని ఇల్లంతకుంటలో కలపడం వల్ల అన్ని విధాల సౌకర్యంగా ఉటుందని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రం కన్నా...ఇల్లంతకుంట తమ గ్రామానికి దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామం నుంచి పెద్దసంఖ్యలో మహళలు తరలివచ్చి కలెక్టరేట్‌ ఎదుట కోలాంటం వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement