తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు.. | Missing boy returned back to their parents, | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..

Mar 23 2017 5:26 PM | Updated on Sep 5 2017 6:54 AM

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..

చాగల్లు గ్రామానికి చెందిన షణ్ముఖసాయి సోమవారం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

► గుర్తించి అప్పగించిన చీరాల విద్యార్థులు
ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామానికి చెందిన షణ్ముఖసాయి సోమవారం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే చీరాల సెయింట్‌మార్క్స్‌ లూథరన్‌ జూనియర్‌ కళాశాల కు చెందిన విద్యార్థులు బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అప్పగించారు.

శింగరాయకొండ వివేకానంద స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సాయి తిరుపతి వెళ్లే ప్యాసింజరు రైలు ఎక్కాడు. ఇదే రైలులో ఇంటర్‌ పరీక్షల ముగించిన విద్యార్థులు తమ అధ్యాపకునితో తిరుపతి దర్శనానికి బయలుదేరారు. బాలుడుని గమనించి తప్పిపోయాడని గుర్తించారు. వారితో పాటు తిరుపతి తీసుకెళ్లారు. అక్కడ దర్శనం అయ్యేవరకు విద్యార్థి తన వివరాలు చెప్పలేదు. తర్వాత అతని తండ్రికి  ఫోన్‌ చేయించారు. బుధవారం హౌరా ఎక్స్‌ప్రెస్‌లో శింగరాయకొండకు తీసుకువచ్చి తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టారు. శ్రీరంగంసాయితేజ, నిమ్మా రమణారావు, గడ్డం శ్రీకాంత్, మీసాల భాస్కరరావు, దారపు అనిల్, కొండమూడ ఉదయకిరణ్, ఎస్‌. మణికంఠను గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement