కత్తులతో బెదిరించి బాలికపై లైంగిక దాడి | minor girl threatened and gang raped in amalapuram | Sakshi
Sakshi News home page

కత్తులతో బెదిరించి బాలికపై లైంగిక దాడి

Nov 21 2015 10:03 PM | Updated on Aug 28 2018 7:22 PM

కత్తులతో బెదిరించి బాలికపై లైంగిక దాడి - Sakshi

కత్తులతో బెదిరించి బాలికపై లైంగిక దాడి

ఇద్దరు దుండగులు ముఖాలకు నల్ల ముసుగులు ధరించి, కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొంకాపల్లిలో జరిగింది.

అమలాపురం టౌన్: ఇద్దరు దుండగులు ముఖాలకు నల్ల ముసుగులు ధరించి, కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొంకాపల్లిలో జరిగింది. ఈ నెల 7న తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబ సభ్యులతో కలిసి బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమలాపురం పట్టణ పోలీసులు శనివారం నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని శనివారం కోర్డులో హాజరు పరిచారు.

కొంకాపల్లికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన రంకిరెడ్డి సత్తిబాబు, కంచిపల్లి తాతబ్బాయి నల్లటి ముసుగులు, పాంట్లు, చొక్కాలు ధరించి లోపలికి చొరబడ్డారు. బాలిక పీకపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించి లైంగికదాడి జరిపారు. కాగా బాలిక ఇంటిపై వేరే విషయమై ఈ ఏడాది ఆగష్టు 11న కొందరు దాడి జరిపారు. వారిలోని వారే తనపై అఘాయిత్యం జరిపి ఉంటారన్న అనుమానాన్ని బాధితురాలు వ్యక్తం చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులకు చివరికి నిందితుల్ని గుర్తించారు. పోస్కో యూక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement