బంధువుల వివాహానికి పంపలేదని ఆత్మహత్య | minar girl suicide | Sakshi
Sakshi News home page

బంధువుల వివాహానికి పంపలేదని ఆత్మహత్య

Dec 19 2016 12:36 AM | Updated on Nov 6 2018 7:53 PM

బంధువుల వివాహానికి పంపలేదని గడ్డంనాగేపల్లికి చెందిన రామాంజనేయులు కూతురు (14) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.

నార్పల: బంధువుల వివాహానికి పంపలేదని గడ్డంనాగేపల్లికి చెందిన రామాంజనేయులు కూతురు (14) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి తెలిపిన మేరకు.. సునీత ఆత్మకూరులో బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి పంపకపోవడంతో తల్లిదండ్రులను బెదిరించేందుకు సూపర్‌వాస్మోల్‌ తాగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రామచంద్రారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement