కరాటేలో పతకాల పంట | medals got karate | Sakshi
Sakshi News home page

కరాటేలో పతకాల పంట

Aug 9 2016 10:26 PM | Updated on Sep 4 2017 8:34 AM

కరాటేలో పతకాల పంట

కరాటేలో పతకాల పంట

ఏలూరు సిటీ : నగరంలోని ది ఇండో ఇంగ్లిష్‌ స్కూల్‌ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు.

ఏలూరు సిటీ :  నగరంలోని ది ఇండో ఇంగ్లిష్‌ స్కూల్‌ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఈబీవీ ప్రసాద్‌ మంగళవారం ఆ వివరాలు తెలిపారు. ఈ నెల 7న వరంగల్‌లో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు పతకాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. హర్షిత్, ప్రణీత్, నరేష్‌ అత్యధిక పతకాలు సాధించినట్టు పాఠశాల కరాటే మాస్టర్‌ రెన్‌షీ ఎహెజ్కేల్‌ తెలిపారు. విద్యార్థులను పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ ఏవీఎన్‌ రాజు, సుభద్ర దేవీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ కళ్యాణి ప్రసాద్, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ మంతెన లక్ష్మీరాజు అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement