పూరి సినిమాలో 'మన్నారా' | mannara get a chance in puri film | Sakshi
Sakshi News home page

పూరి సినిమాలో 'మన్నారా'

Aug 12 2016 10:16 PM | Updated on Mar 22 2019 1:53 PM

పూరి సినిమాలో 'మన్నారా' - Sakshi

పూరి సినిమాలో 'మన్నారా'

జక్కన్న ఫేమ్ మన్నారా చోప్రా పూరి సినిమా లో చాన్స్ కొట్టేసింది.

సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి:  గత కొంత కాలంగా టాలీవుడ్‌పై కన్నేసిన ముంబై సుందరి మన్నారా చోప్ర ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన జక్కన్న సినిమాలో సునీల్‌ సరసన హీరోయిన్‌ పాత్రలో మెరిసిన మన్నారా... తాజాగా విడుదలైన ‘తిక్క’ సినిమాలోనూ ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. ఇక టాప్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తీస్తున్న కొత్త చిత్రంలో సైతం ఛాన్స్‌ కొట్టేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అందాల క్రేజీ సుందరి చెప్పిన కబుర్లివి...
      
నగరంతో నవమాసాల అనుబంధం..
దాదాపు 9 నెలలుగా హైదరాబాద్‌లో ఒకే హోటల్‌లో ఉంటున్నాను. ఇక్కడ ఫ్యాషన్‌ షోలతో పాటు ప్రమోషన్‌ యాక్టివిటీస్‌ కూడా చేస్తూ బిజీబిజీగా ఉన్నాను. ఈ సిటీ నన్ను బాగా ఆదరించింది. బహుశా ఈ సిటీకి కొంతకాలం గాని దూరంగా ఉండాల్సి వస్తే ‘హోమ్‌సిక్‌’ ఫీలవుతానేమో.. అంత బాగా నచ్చిందీ నగరం.

టాలీవుడ్‌ సూపర్‌..
తెలుగు చిత్ర పరిశ్రమ నాకు చాలా నచ్చింది. డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండడంతో ఓ రకంగా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా నేను కెరీర్‌ మొదలుపెట్టాను. బాలీవుడ్‌లోనూ నటించాను. అయితే టాలీవుడ్‌లోని ప్రొఫెషనలిజం నన్ను ఆకట్టుకుంది. తక్కువ టైమ్‌లోనే హీరోయిన్‌ అయ్యాను. ఇప్పుడు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ సినిమాలోనూ అవకాశం రావడంతో నా కల నిజమైనట్టు అనిపిస్తోంది. నిజంగా ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు.

డ్యాన్స్‌... డ్రీమ్‌
లక్కీగా నాకు ఇప్పటిదాకా మంచి పాత్రలే వచ్చాయి. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అనుభవజ్ఞులైన నటీనటుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పైగా రెగ్యులర్‌ గ్లామర్‌ రోల్స్‌ కాకుండా క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉన్నవే చేసే అవకాశం కూడా అందరికీ దక్కేది కాదు. ఇక డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదు. కానీ డ్యాన్స్‌ బేస్‌్డగా ఏదైనా పాత్ర వస్తే చేయాలని ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement