అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | man suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Oct 3 2016 1:22 AM | Updated on Sep 4 2017 3:55 PM

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

వాకాడు : అనునాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. మండలంలోని తూపిలిపాళెం బీచ్‌ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 
వాకాడు : అనునాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడు. మండలంలోని తూపిలిపాళెం బీచ్‌ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సుధాకర్, తన సిబ్బందితో సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి   నాలుగు రోజులు క్రితం చనిపోయి ఉండొచ్చునని, తీరానికి వచ్చి మద్యం తాగి దాహార్తితో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు ఆరెంజ్‌ కలర్‌లో సన్నగడుల చొక్కా, పూతల లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement