కళ్యాణదుర్గం : మండల పరిధిలోని వర్లి గ్రామానికి చెందిన రమేష్ నాయక్ (47) మంగâýæవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన జయరాం నాయక్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సత్యనారాయణ, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పొద్దుపోయాక జయరాం నాయక్, రమేష్ నాయక్‌ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. విందు ముగిశాక ఇద్దరి మధ్య చిన్న విషయమై ఘర్షణ నెలకొంది. క్షణికావేశంలో జయరాం నాయక్ గడ్డపారతో రమేష్ నాయక్ తలపై బాదాడు. దీంతో రమేష్‌నాయక్ అక్కడకక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితుడు పోలీసుస్టేçÙ¯ŒSలో లొంగిపోయినట్లు సమాచారం. రూరల్ ఎస్‌ఐ నబీరసూల్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ నాయక్ ఇది వరకే పలు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు.