పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి | man dies of light stream | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి

Apr 28 2017 12:12 AM | Updated on Sep 5 2017 9:50 AM

పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి

పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి

కళ్యాణదుర్గం రూరల్‌ మండలం తూర్పుకోడిపల్లి సమీపంలో పిడుగుపడి అదే గ్రామానికి చెందిన బలికొండప్ప కుమారుడు ఓబుళపతి(35) అనే గొర్ల కాపరి గురువారం మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు.

కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం రూరల్‌ మండలం తూర్పుకోడిపల్లి సమీపంలో పిడుగుపడి అదే గ్రామానికి చెందిన బలికొండప్ప కుమారుడు ఓబుళపతి(35) అనే గొర్ల కాపరి గురువారం మృతి చెందినట్లు రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ తెలిపారు. ఓబుళపతి మేత కోసం మేకలను పొలాల వద్దకు తోలుకెళ్లాడన్నారు.

సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా వర్లి వ్యవసాయ పొలాల వద్ద ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందినట్లువవివరించారు. పరిసరాల్లో పని చేసే వారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా. అప్పటికే అతను చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement