రామన్నపేట: నిద్రమత్తులో రైలు నుంచిlజారిపడి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం రాత్రి రామన్నపేట శివారులో జరిగింది.
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
Aug 23 2016 9:03 PM | Updated on Sep 28 2018 3:41 PM
రామన్నపేట: నిద్రమత్తులో రైలు నుంచిlజారిపడి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం రాత్రి రామన్నపేట శివారులో జరిగింది. నల్లగొండ బస్టాండ్ సమీపంలోని సంతోష్‌నగర్‌కు చెందిన సురిగి అజయ్‌కుమార్(38) బీబీనగర్‌లోని ఎంఎస్ కంపనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు ట్రైన్‌పాస్ ద్వారా వచ్చిపోతున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని నల్లగొండకు బయలుదేరాడు. రామన్నపేట శివారులో ఐడియల్ కంపనీ దగ్గర రైలు నుంచిlకిందపడ్డాడు. తీవ్రగాయాలు పాలైన అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. డెమోరైలులోగానీ, డెల్లాప్యాసింజర్‌లోగానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య మేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement