ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

Sep 29 2016 1:33 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య - Sakshi

ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య

వాకాడు : ఉరేసుకుని వస్త్ర వ్యాపారి మండలంలోని చినతోట సమీపంలో ఉన్న జామాయిల్‌ తోటలో మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వాకాడు : ఉరేసుకుని వస్త్ర వ్యాపారి మండలంలోని చినతోట సమీపంలో ఉన్న జామాయిల్‌ తోటలో మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా నగిరి ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారి బండి బుజ్జయ్య (56) చినతోట ప్రాంతంలో లుంగీలు తెచ్చి అమ్మేవాడు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా కలహాలు ఏర్పడటంతో బుజ్జయ్య చినతోటలోనే ఉండేవాడు. ఈ క్రమంలో తాను అమ్మే లుంగీతోనే జామాయిల్‌ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న వాకాడు ఎస్‌ఐ సుధాకర్‌  సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement