కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
విజయవాడ: కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బార్ మేనేజర్ వెంకట్రావు సహకారంతో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. విజయవాడలోని స్వర్ణ బార్లో మద్యం సేవించి అయిదుగురు మృత్యు వాత పడగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు బార్లోనే కల్తీ జరిగినట్లు గుర్తించారు.