సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ కమిటీ నాయకులు అన్నారు.
మహబూబ్‌నగర్: సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ కమిటీ నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేసి శ్రమదోపిడిని అరికట్టాలన్నారు.