చంద్రప్రభ పై గణనాథుడి విహారం | lord vinayaka on chandraprabha vahanam | Sakshi
Sakshi News home page

చంద్రప్రభ పై గణనాథుడి విహారం

Sep 20 2016 12:19 AM | Updated on Sep 4 2017 2:08 PM

వరసిద్ధుడి ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు

వరసిద్ధుడి ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు

స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరుల సమేతుడైన గణనాథుడు సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వరసిద్ధి వినాయక స్వామి, సోమవారం, చంద్రప్రభ వాహనం

 
కాణిపాకం(ఐరాల): స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరుల సమేతుడైన గణనాథుడు సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కర్పూర హరతులు జయజయ ధ్వానాలనడుమ స్వామివారు ఆలయ వీధుల్లో ముందుకు కదిలారు. వాహనసేవకు కాణిపాకం, చిన్నకాంపల్లె, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, తిరువణంపల్లె, బొమ్మసముద్రం, అగరంపల్లె ,పుణ్యసముద్రం, మారేడుపల్లె, సంతపల్లె, ఉత్తరబ్రాహ్మణ పల్లె, కారకాంపల్లెకు చెందిన హరిజన వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాది అభిషేకాలు నిర్వహించి చందనాలంకరణ చేశారు. తదుపరి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. రాత్రికి స్వామివారికి చంద్రప్రభ వాహనసేవ నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అలంకార మండపంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు ఉత్సవ దేవేరులను చంద్రప్రభ వాహనం ఆశీనులు గావించారు. గణనాథుడు వెన్నకుండ ధారిౖయె కాణిపాకం పురవీధుల్లో మంగళవాయిద్యాలు, మేళతాలాలు మధ్య ఊరేగారు. స్వామివారి వాహనం ముందు కోలాటాలు, పిల్లనగ్రోవి నృత్యాలు, లంబాడి నృత్యాలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామి దేవేరులను దర్శించుకుని తమ మెక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేష్, డీఈ  మురళి బాలకృష్ణ, డీఈఈ సునీల్‌ బాబు, ఏఈవో కేశరావు, సూపరింటెండెంట్‌లు రవీంద్ర బాబు, స్వామి, ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పలువురు పాల్గొన్నారు.
ఆస్థాన మండపంలో..
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేకోత్సవాల్లో  సోమవారం చంద్రప్రభ వాహనం సందర్భంగా స్థానిక ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన సాంస్కృక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టు కున్నాయి. భరతనాట్యం, కూచిపూడి,తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రదర్శించిన శ్రీనివాస కల్యాణం పౌరాణిక నాటిక ప్రదర్శన, తోలు బొమ్మలాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం లంబాడీ నృత్యాలు, భక్తిగీతాలు, సంగీత కచ్చేరి అలరించాయి. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన కళాకారులకు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పూర్ణచంద్రరావు గుర్తింపు పత్రాలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement