కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పేర్కొన్నారు.
విజయవాడ: కాపు కార్పొరేషన్‌కు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పేర్కొన్నారు. ఈ నెల 25న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపులకు రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు 350 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామానుజయ తెలిపారు.