ఇందిరమ్మ గహ నిర్మాణ పథకం మూడు విడతలు, రచ్చబండ, జీఓ నెంబర్ 171 కింద నిలిచి పోయిన గహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని గహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ రాజశేఖర్ తెలిపారు.
ఇందిరమ్మ బిల్లు బకాయిలకు లైన్‌క్లీయర్
Sep 10 2016 12:54 AM | Updated on Sep 4 2017 12:49 PM
	కర్నూలు(అర్బన్):   ఇందిరమ్మ గహ నిర్మాణ పథకం మూడు విడతలు, రచ్చబండ, జీఓ నెంబర్ 171 కింద నిలిచి పోయిన గహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్  బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని గహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ రాజశేఖర్ తెలిపారు. వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు రూ.5.09 కోట్లు పెండింగ్‌లో ఉండగా ఆగష్టులో రూ.4.71 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. బీఎల్, బీబీఎల్ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ జాబితాలో 27,473  నిర్మాణాలున్నాయని, వీటికి దాదాపు రూ.14.96 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి 10రోజుల్లోగా అర్హుల జాబితా రూపొందించి పంపితే బిల్లు మంజూరవుతుందని పీడీ తెలిపారు. 
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
