పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో కలత చెందిన కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు.
పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో కలత చెందిన కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పుల విజేందర్(36) మేస్ర్తీ పనులు చేసుకుంటూనే రెండెకరాలు పొలం కౌలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేశాడు. తర్వాత వర్షం ముఖం చాటేయడంతో విత్తనాలు సక్రమంగా మొలవలేదు. దీంతో కలత చెందాడు. ఇదే విషయాన్ని ఉదయం కుటుంబ సభ్యులతో చెబుతూ.. గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు.