‘అమృత్‌’ పనులపై స్థల పరిశీలన | land verify for amruth project | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’ పనులపై స్థల పరిశీలన

Sep 26 2016 11:51 PM | Updated on Sep 4 2017 3:05 PM

కట్టమంచి చెరువు వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

కట్టమంచి చెరువు వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

‘అమృత్‌’ పథకంలో భాగంగా చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు.

చిత్తూరు (అర్బన్‌):  ‘అమృత్‌’ పథకంలో భాగంగా  చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు. కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు భాస్కరరావుతో పాటు టాటా కన్సల్టెన్సీ నిర్వాహకులు నగరంలోని ఓవర్‌ బ్రిడ్జి, కట్టమంచి చెరువు, ఇరువారం, నీవానది ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నుంచి వచ్చే మురుగునీరు నీవానదిలో కలవకముందే శుద్ధి చేసి ఇతర అవసరాలను ఉపయోగించేలా ప్లాంట్‌ను పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై స్థలాలను అధికారులు పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement