ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి | lady constable slaped bus passinger in adilabad district | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి

Aug 30 2015 2:58 PM | Updated on Sep 3 2017 8:25 AM

ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి

ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ దాడి

బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది.

ఆదిలాబాద్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. అకారణంగా కానిస్టేబుల్ తనపై దాడి చేసిందని బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వివరాలు.. కప్పర్ల గ్రామానికి చెందిన గంగూతాయి(18) అనే యువతి తలమడుగు మండలం ధరమ్‌పూర్ గ్రామం నుంచి అదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది.

బస్సులో బాగా రద్దీ ఉండటంతో.. ఫుట్‌బోర్డులో నిలబడింది. అదే సమయంలో బస్సులో తోపులాట జరగడంతో పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్ను అనూష ఢీకొంది. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళా కానిస్టేబుల్.. 'కళ్లు కనిపించడం లేదా మీద పడతావెందుకు' అని ఆమెను దుర్భాషలాడింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అలా జరిగిందని గంగుతాయి  చెప్పింది. 'మాటకు మాట బదులు చేప్తావా' అంటూ యువతిపై దాడిచేసి ఆమెను కొట్టింది. దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement