చచ్చిపోదామని పట్టాలపై ..ఇంతలో వచ్చింది దేవత ! వైరల్‌ వీడియో

RPFLady Constable Sumathi rescued man who wanted to die - Sakshi

న్యూఢిల్లీ: జీవితంలో ఆశను కోల్పోవద్దు అని ఎంత చెప్పినా తృణప్రాయంగా ప్రాణాల్ని  త్యజిస్తున్న  వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.   చివరికి ఆత్మహత్య చేసు కోవడం నేరం అని చెప్పినా కూడా చాలామంది సూసైడ్‌ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ఒక్క క్షణం వారిని మృత్యు ముఖ్యం నుంచి తప్పించగలిగితే, సరియైన కౌన్సిలింగ్‌ ఇప్పించ గలిగితే జీవితం విలువ తెలిసి వస్తుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్న మాట.

అయితే తాజాగా చనిపోవాలని పట్టాలపై పడుకున్న వ్యక్తిని తృటిలో ప్రమాదంనుంచి తప్పించిన వైనం ఒకటి వైరల్‌గా మారింది. (తల్లి అకౌంట్‌నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్‌ గుండె గుభిల్లు!)

వెస్ట్‌ బెంగాల్‌లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్‌పీఎఫ్‌ ఇండియా ట్విటర్‌ హ్యాండిల్‌ ఈ ఘటనకుసంబంధించినవీడియోను షేర్‌ చేసింది. దీని  ప్రకారం రైలు కింద పడిచనిపోవాలనుకున్న యువకుడు చాలాసేపే అక్కడక్కడే తచ్చట్లాడాడు. చివరికి అతివేగంగా దూసుకు రానున్న రైలు కింద పడేలా పట్టాలపై పడుకున్నాడు. అయితే  డ్యూటీలో ఉన్న  లేడీ కానిస్టేబుల్  సుమతి ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా కదిలి అతగాడిని  ట్రాక్‌పై నుండి లాగాపడేశారు. అంతే క్షణాల్లో అతడు  యమపాశంనుంచి తప్పించుకున్నాడు. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్‌ నెక్లెస్: షాకింగ్‌ న్యూస్‌!)

సుమతి నిర్భయంగా ముందుకు కదిలి ఆ వ్యక్తిని ప్రాణాలను కాపాడిన  వైనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుడోస్‌ సుమతి మేడమ్‌ అంటూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆత్యహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికిపై కేసు నమోదు చేయకుండా, దయచేసి అతనికి సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు.  ఈ వీడియో దాదాపు 264.6 వేల  వ్యూస్‌, 7వేలకు పైగా లైక్స్‌, 232 రీట్వీట్లను సాధించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top