విజ‌య్ మాల్యా 4 గంట‌ల ఇంట‌ర్వ్యూ.. 'సోష‌ల్' హ‌ల్‌చ‌ల్‌ | How social media reacts on Vijay Mallya podcast | Sakshi
Sakshi News home page

విజ‌య్ మాల్యా ఇంట‌ర్వ్యూ.. 'సోష‌ల్' హ‌ల్‌చ‌ల్‌

Jun 11 2025 5:29 PM | Updated on Jun 11 2025 5:46 PM

How social media reacts on Vijay Mallya podcast

ప్ర‌ముఖ‌ వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా మ‌ళ్లీ లైమ్ లైటులోకి వ‌చ్చారు. మాల్యాపై సోష‌ల్ మీడియా మీడియాలో తాజాగా చ‌ర్చోప చ‌ర్చలు న‌డుస్తున్నాయి. యూట్యూబ‌ర్‌, సోష‌ల్ మీడియా ఇన్‌ప్లుయెన్స‌ర్‌ రాజ్ ష‌మానీ (Raj Shamani)కి ఇటీవ‌ల పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంట‌ల పాటు సాగిన‌ సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వ‌ర‌కు అన్ని విష‌యాలు మాట్లాడారు. పాల‌కులు త‌న‌ను బ‌లిప‌శువును చేశార‌న్న‌ట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాలు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తన‌ను వాడుకున్నాయ‌ని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి తాను ఆస‌క్తి చూపించినా పాల‌కులు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు.

బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించాన‌ని, అయినా త‌న‌ను ఎగ‌వేత‌దారుడిగా ముద్ర వేశార‌ని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేద‌ని, అనుకోని ప‌రిస్థితుల్లో స్వదేశానికి దూర‌మ‌య్యాన‌ని చెప్పారు. త‌న‌పై మోపిన అభియోగాల‌పై నిష్ప‌క్ష‌పాత విచార‌ణ జ‌రుపుతామ‌ని భార‌త ప్ర‌భుత్వం హామీయిస్తే స్వదేశానికి తిరిగి వ‌స్తాన‌ని అన్నారు. మ‌రోవైపు మాల్యా మాట‌ల‌కు బ్యాంకులు కూడా దీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వ‌డ్డీల లెక్క‌ల‌తో ఆయ‌న‌కు బ‌దులిచ్చాయి.

కాగా, విజ‌య్ మాల్యా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. దీనిపై ఎక్స్‌లో మాల్యా స్పందిస్తూ.. త‌న హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. 'ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పడం, నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @rajshamani తో నా 4 గంటల పాడ్‌కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క‌ YouTubeలోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక' అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

చ‌ద‌వండి: జస్ట్ ప‌రారీలో ఉన్నాను.. దొంగ‌ను మాత్రం కాదు

విజ‌య్ మాల్యా ఇంట‌ర్వ్యూపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మాల్యాకు మ‌ద్ద‌తుగా కొంద‌రు పోస్టులు పెడుతున్నారు. మ‌రికొంత మంది మాత్రం ఆయ‌న అబ‌ద్దాలు చెప్పారంటూ విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకొంత మంది మీమ్స్‌, వీడియోల‌తో సైట‌ర్లు పేలుస్తూ హాస్య‌చతుర‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement