కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి | kuruba sangham meeting in parigi | Sakshi
Sakshi News home page

కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Jan 8 2017 10:17 PM | Updated on Sep 5 2017 12:45 AM

కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఆర్థికంగా వెనుకబడిన కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షడు శంకరనారాయణ
పరిగి(పెనుకొండ రూరల్‌) : ఆర్థికంగా వెనుకబడిన కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కురుబ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ ...ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పార్థసారథి కూడా కురుబలను పూర్తిగా విస్మరించారన్నారు. కురుబలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు.

అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే అది సాధ్యమని, అందువల్ల కురుబలంతా తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను చదివిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లేనన్నారు. కురుబలు కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారనీ,  రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చేలా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేటీ శ్రీధర్, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ నాయకులు వెంకటరమణ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement