బిందెలో తల ఇరుక్కుని తల్లడిల్లిన చిన్నారి | kid ankitha head takeout from pot | Sakshi
Sakshi News home page

బిందెలో తల ఇరుక్కుని తల్లడిల్లిన చిన్నారి

Jan 10 2016 11:14 PM | Updated on Sep 3 2017 3:26 PM

బిందెలో తల ఇరుక్కుని తల్లడిల్లిన చిన్నారి

బిందెలో తల ఇరుక్కుని తల్లడిల్లిన చిన్నారి

ఆడుకుంటున్న ఓ చిన్నారి తన తలపై బిందెను పెట్టుకోవడంతో అది మెడ భాగం వరకు అందులోనే ఇరుక్కుని తల్లడిల్లిపోయింది.

కొడకండ్ల (వరంగల్): ఆడుకుంటున్న ఓ చిన్నారి తన తలపై బిందెను పెట్టుకోవడంతో అది మెడ భాగం వరకు అందులోనే ఇరుక్కుని తల్లడిల్లిపోయింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ జిల్లా కొడకండ్ల శివారులో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి రెండు కుటుంబాలు మండల కేంద్ర శివారులోని ఇటుకబట్టీలో పని చేసేందుకు ఇక్కడికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇటుకల బట్టీ పనిలో ఉండగా, అంకిత అనే నాలుగేళ్ల చిన్నారి బిందెతో ఆడుకునే క్రమంలో తల అందులో ఇరుక్కుపోయింది.

తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బిందె నుంచి పాప తలను బయటకు తీయడానికి రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అనంతరం చిన్నారిని సైకిల్‌పై మండల కేంద్రానికి తీసుకెళ్లారు. మోటార్ మెకానిక్ నర్మెట్ట ఉపేందర్ కట్టర్ తో బిందెను కట్ చేసి అందులో ఇరుక్కున్న చిన్నారి అంకిత తలకు ఎటువంటి గాయాలు కాకుండా బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement