ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కదిరి తిరువీధుల్లో సింహవాహనంపై తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు.
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కదిరి తిరువీధుల్లో సింహవాహనంపై తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. మనుషుల్లో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటి చెప్పడానికే స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మండపోత్సవం నిర్వహిస్తారు.
యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన నిరంజన్, కదిరి పట్టణానికి చెందిన లక్ష్మీదేవమ్మ, రుక్మిణమ్మ, మాడిశెట్టి నరసయ్య కుటుంబీకులు వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు.