కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి | kethepalli combined in to suryapeta | Sakshi
Sakshi News home page

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

Aug 28 2016 8:33 PM | Updated on Sep 4 2017 11:19 AM

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి

కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో ఉన్న కేతేపల్లి మండలాన్ని ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో కలిపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో ఉన్న కేతేపల్లి మండలాన్ని ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో కలిపాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. మండలాన్ని సూర్యాపేట జిల్లాలో విలీనం చేసేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చేందుకు మండలానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివారం కేతేపల్లిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమంలో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున ప్రజలతో నల్లగొండకు వెళ్లి జిల్లా కలెక్టరేట్‌కు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి మండల ప్రజలు, మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన జె.వెంకటనర్సయ్యయాదవ్, కోట మల్లికార్జునరావు, కోట పుల్లయ్య, కె.ప్రదీప్‌రెడ్డి, ఎ.జోగిరెడ్డి, కోట లింగయ్య, చందా రామ్మూర్తి, బి.జాన్‌రెడ్డి, కోట సంపత్‌రావు, ఎన్‌.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement