'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని' | kesavareddy sent to remand | Sakshi
Sakshi News home page

'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని'

Sep 10 2015 1:42 PM | Updated on Sep 3 2017 9:08 AM

'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని'

'మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడ్ని'

మంచి ఉద్దేశంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశం తనకు లేదని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు

కర్నూలు:  మంచి ఉద్దేశంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశం తనకు లేదని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఐపీ పెట్టేవాడినని, ఏడాది ఆగితే అందరికీ చెల్లిస్తానని ఆయన తెలిపారు. లేదంటే ప్రభుత్వం తన ఆస్తులను జప్తు చేసుకోవచ్చని కేశవరెడ్డి గురువారమిక్కడ అన్నారు. కాగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు సిసిఎస్‌ పోలీసులు గతరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. తమ సంస్థల స్కూళ్లు‌, కాలేజీల్లో జాయినింగ్‌ సమయంలో విద్యార్థుల నుంచి లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకూ కేశవరెడ్డి డిపాజిట్లు సేకరించారు. ఆ డిపాజిట్ల సొమ్ము దాదాపు 8వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులకు బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదుతో కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించటంతో ఆయనపై అయిదు కేసులు నమోదు చేశారు.

అయితే కేశవరెడ్డి బాధితులు.. భారీగానే వున్నారు. ఒక్కోజిల్లాలో కోట్లాది రూపాయలు వసూల్‌ చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలో కేశవరెడ్డి విద్యాసంస్థలు నెలకొల్పారు. మదనపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు బకాయిపడ్డట్లు తెలుస్తోంది. తిరుపతి బ్రాంచ్‌లో కూడా పెద్దఎత్తున చెల్లించాల్సి ఉందని సమాచారం.

 

ఈ బకాయిలుతో గత యాజమాన్యానికి సంబంధం లేదని, కొత్త యాజమాన్యం జూలైలో ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత స్కూల్ మేనేజ్‌మెంట్‌ మారిపోయింది. ఆ మేనేజ్‌మెంట్‌ కూడా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేశవరెడ్డిని అరెస్ట్‌ చేసిన కర్నూలు సీసీఎస్‌ పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement