క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు | Kurnool Three Town police Arrest Cricket Betting Gang | Sakshi
Sakshi News home page

Jan 23 2019 7:07 PM | Updated on Jan 23 2019 7:17 PM

Kurnool Three Town police Arrest Cricket Betting Gang - Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో విద్యార్థులు అధికంగా..

సాక్షి, కర్నూలు: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు రట్టు చేశారు. బుధవారం ముఠాపై దాడి చేసిన త్రీ టౌన్‌ పోలీసులు.. ముఠాలోని 15 మందిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 5,56,500 రూపాయల నగదుతో పాటు, 2.25 కోట్ల రూపాయల విలువ చేసే 189 ప్రామిసరీ నోట్లు, 30 సెల్‌ఫోన్లు, 92 చెక్కులు, ఒనిడా టీబీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాకు చెందిన మరో 11 మంది పరారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, క్రికెట్‌ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిలో విద్యార్థులు అధికంగా ఉండటం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement