బాబూ.. గిరిజనులకు భూములేవి? | kakani press meet | Sakshi
Sakshi News home page

బాబూ.. గిరిజనులకు భూములేవి?

Oct 4 2016 1:28 AM | Updated on Oct 29 2018 8:27 PM

బాబూ.. గిరిజనులకు భూములేవి? - Sakshi

బాబూ.. గిరిజనులకు భూములేవి?

ముత్తుకూరు : పేద గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి రెండు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క సెంటు భూమైనా పంపిణీ చేశారా? అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు . గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా సోమవారం పైనాపురం పంచాయతీలో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు.

  •  బాబు వాగ్దాన భంగంపై కాకాణి ఫైర్‌
  •  పైనాపురంలో గడపగడపకు వైఎస్సార్‌ 
  •  ముత్తుకూరు : పేద గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి రెండు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క సెంటు భూమైనా పంపిణీ చేశారా? అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా సోమవారం పైనాపురం పంచాయతీలో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జెన్‌కో ప్రాజెక్ట్‌ యాష్‌పాండ్‌కు దగ్గరగా ఉన్న దేవరదిబ్బ గిరిజనకాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించే అంశం జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులివ్వకుండా చంద్రబాబు ఓడిపోయిన వారికి అప్పగించి, దుష్ట సంప్రదాయానికి ఒడిగట్టారన్నారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తుంటే తనపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి విమర్శలకు భయపడి, జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. తొలుత కాకాణి స్థానిక భోగేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్‌, సర్పంచ్‌లు పల్లంరెడ్డి జనార్దన్‌రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, మండల నాయకులు లక్ష్మణరెడ్డి, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, కలికి చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, చిన్నపరెడ్డి, ధనుంజయరెడ్డి, గండవరం సూరి, చెంగారెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, చిన్నపరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement