బెంగళూరు ఐసీఐసీఐ బ్యాంకు, అనంతపురం ఫ్లిప్‌కార్టు సంస్థలో డెలివరీ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఈనెల 20న ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీసీ కేంద్రంలో జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ– వెలుగు పీడీ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : బెంగళూరు ఐసీఐసీఐ బ్యాంకు, అనంతపురం ఫ్లిప్‌కార్టు సంస్థలో డెలివరీ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఈనెల 20న ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీసీ కేంద్రంలో జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ– వెలుగు పీడీ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ.10 వేలు వేతనం కలిగిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు.
నెలకు రూ.8 వేలు, అదనంగా టీఏ కలిగిన ఫ్లిప్‌కార్డుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉండాలని తెలిపారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో స్థానిక పంగల్‌రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీ కేంద్రంలో హాజరు కావాలని సూచించారు.