 
															గుండెపోటుతో ఎమ్మెల్యే సోదరుడి మృతి
విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు జలీల్‌ఖాన్ సోదరుడు మున్వర్‌ఖాన్ (56) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
విజయవాడ : విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు జలీల్‌ఖాన్ సోదరుడు మున్వర్‌ఖాన్ (56) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వన్‌టౌన్‌లోని తారాపేటలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.
	అయితే శుక్రవారం ఉదయం మున్వర్‌ఖాన్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా...  ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. మున్వర్ఖాన్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
