శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదాయ పన్ను శాఖ పెద్ద ఎత్తున సోదాలు సాగిస్తున్నారు
పలాస(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదాయ పన్ను శాఖ పెద్ద ఎత్తున సోదాలు సాగిస్తున్నారు. విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన 82 మంది ఐటీ అధికారులు 18 బృందాలుగా విడిపోయి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, జీడిపప్పు పరిశ్రమల్లో సోదాలు చేపట్టారు.
ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాల్లో ఏమేరకు అక్రమ ఆస్తులు గుర్తించారనేది వెల్లడి కాలేదు. సాయంత్రం ఐటీ కమిషనర్ వచ్చేదాకా వివరాలు వెల్లడించబోమని అధికారులు చెబుతున్నారు.