10 మంది విద్యార్థులకు ఇస్కా అవార్డులు | Iska awards to 10 students | Sakshi
Sakshi News home page

10 మంది విద్యార్థులకు ఇస్కా అవార్డులు

Jan 5 2017 3:25 AM | Updated on Sep 5 2017 12:24 AM

శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమకున్న ప్రతిభను వ్యాసరచన పోటీల్లో తెలియజేసిన 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్ ఇస్కా ట్రావెల్‌ అవార్డులను ప్రకటించింది.

ఇందులో ఆరుగురు తెలుగువారే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమకున్న ప్రతిభను వ్యాసరచన పోటీల్లో తెలియజేసిన 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్ ఇస్కా ట్రావెల్‌ అవార్డులను ప్రకటించింది. తిరుపతి శ్రీపద్మావతీ యూనవర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బుధవారం ఉదయం జరిగిన జాతీయ స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ సదస్సులో 2016–17 కింద అవార్డులను ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నోబెల్‌ గ్రహీత టకాకి కజిట(జపాన్) చేతుల మీదుగా వీటిని విద్యార్థులకు ప్రదానం చేశారు. మొదటి మూడు బహుమతులను కాన్పూరులోని సేత్‌ ఆనంద్రం జైపురి స్కూల్‌కు చెందిన తుషార్‌ అగర్వాల్, షీన్ పరీమూ, శౌర్యసింగ్‌ గెలుచుకున్నారు. మహాదేవి బిర్లా వరల్డ్‌ అకాడమీ స్కూల్‌(ఢిల్లీ) విద్యార్థి సుభాంజలి సరస్వతి నాలుగో బహుమతి గెలుచుకున్నారు. తెలంగాణలోని మహబూబాబాద్‌ మాంటిస్సోరి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థిని మనస్విని, తిరుపతి భారతీయ విద్యాభవన్ విద్యార్థులు సంజయ్, జితేంద్ర, తిరుపతి విద్యానికేతన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు విధాయని, ప్రణీత్‌కుమార్, మార్గ్‌ చిన్మయ విద్యాలయ విద్యార్థి కపిలేశ్వర్‌లకు ఈ పురస్కారాలు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement